ప్రొద్దటూరు రామేశ్వరం

ప్రొద్దటూరు రామేశ్వరం అసలు పేరు ముక్తి రామ లింగేశ్వరం… ప్రొద్దటూరు కి ఆ పేరు తీసుకొచ్చింది కూడా ఈ ముక్తి రామలింగేశ్వరమే

మన అందరికి తెలుసు పూర్వం ప్రొద్దటూరు పేరు బ్రధానపురి అని... పురాతన రామాయణం లో శ్రీ రాముడు రావణాసురుడిని సంహరించి సీత దేవి ని తీసుకోని అయోధ్య కి తిరిగి వస్తుండగా బ్రధానపురి దగ్గరలోని పెన్నా నది సమీపం లో తమ వెంట ఒక మార్జాలం రావడాన్ని శ్రీ రాముడు గమనించాడు

అది మన వెంట ఎందుకు వస్తుంది అని తమ గురువు గారిని అడగగా.. రాముడు రావణుడిని చంపి ముక్తి ప్రసాదించడం మర్చిపోవడం తో రావణాసురుడు ముక్తి కోసం పిల్లి రూపం లో తమ వెంట వస్తున్నాడు అని శ్రీ రాముడి గురువు చెబుతారు..

దీనికి పరిష్కారంగా ఆ పిల్లి ని చంపి ముక్తి ప్రసాదించమని శ్రీ రాముడి గురువు గారు చెప్తే శ్రీ రాముడు తన బాణం తో ఆ పిల్లి ని చంపి ముక్తి ప్రసాదిస్తాడు.. రాముడు బ్రాహ్మణా జాతికి చెందిన వాడు కావడం తో పిల్లిని ని చంపినా దోషం రాముడికి తగులుతుంది ఆ దోషం పోవాలంటే ప్రొద్దు పొడిచేలోపు బ్రధాన పూరి లో శివలింగం ప్రతిష్టించాలి కానీ మన ప్రొద్దటూరు ఇసుక ప్రాంతం కావడం వల్ల ఎంత వెతికిన శివలింగం దొరకదు..

రాముడు హనుమంతుడికి కాశి నుండి శివలింగం తీసుకురమ్మని పంపిస్తారు… ఆలా వెళ్లిన హనుమంతుడు ఎంత సేపటికి రాకపోగా ఇక్కడ ప్రొద్దు పొడుస్తూ ఉంటుంది దానితొ రాముడు ఇసుక తో ఒక శివలింగాన్ని చేసి దానిని గర్భ గుడిలో ప్రతిష్టించాడు అదే మన ఈ రామేశ్వరం గుడి.... ప్రొద్దు పొడవకముందే శివలింగం ప్రతిష్టించడం తో ఇక్కడ ప్రజలు బ్రధానపురి కి ప్రొద్దటూరు అని పేరు పెట్టుకున్నారు

రాముడు ప్రతిష్టించాక హనుమంతుడు శివలింగం తీసుకోని వస్తాడు తాను రాక ముందే రాముడు శివలింగం ప్రతిష్టించడం చుడి హనుమంతుడు బాధ పడతాడు.. హనుమంతుడి అలక తీర్చడానికి రాముడు రామేశ్వరం గుడి ముందు హనుమంతుడు తెచ్చిన ఇంకో లింగాన్ని ప్రతిష్టిస్తాడు ఆలా ప్రతిష్టించిన ఇంకో లింగమే రామేశ్వరం గుడి ముందు ఉన్న కాశి హనుమాన్ లింగేశ్వర స్వామి ఆలయం..

రామేశ్వరం కి ఉన్న ఈ గాలి గోపురం సుమారు 500 సంవత్సరాల క్రితం శ్రీ కృష్ణ దేవరాయలు కట్టింది..

గుడి బయట ఉన్న ఈ శీలా రతి పాలకల లో ముక్తి రామేశ్వరం పూర్తి చరిత్ర పురాతన తెలుగు లో శ్రీ కృష్ణ దేవరాయలు చే రాయబడింది అని చెప్తారు

గుడి బయట ఉన్న ఈ శిలలు సుమారు 500 ఏళ్ల నాటివి వీటి అందాలు మనం చూడవచ్చు

గుడిలో ఉన్న ఈ దక్షిణ మూర్తి ఆలయం భిన్నంగా అటు తిరిగి ఉండటం వాళ్ళ అందరు దీనికి కూడా చరిత్ర ఉంది అనుకుంటారు గని ఆలా ఏమి లేదు దక్షిణ మూర్తి ఆలయం కాబట్టి దక్షిణానికి తిరిగి ఉంది అంతే

ప్రతి సంవత్సరం కార్తీక సోమవారం గుడిలో పెద్ద జాతర జరగడం ఆనవాయితీ గ వస్తుంది

ఇంతే కాదు గుడిలో ఎన్నో మర్మాలు ఎన్నో చరిత్రలు దాగి ఉన్నాయి కొన్ని వేల ఏళ్ళ చరిత్ర ఉంది ఈ గుడిలో

కానీ ఎవ్వరు పట్టించుకోవట్లేదు గోపురం శిధిలావ్యస్థకు చేరింది… 500 ఏళ్ళ చరిత్ర ఉన్న శీలా ఫలకాలను గుడి బయట గాలికి వదిలేసారు… ఎవరో వస్తారు మరమ్మతులు చేస్తారు అని చూడకుండా ఆలయ ధర్మ కర్తలు గుడి చరిత్ర ని రక్షిస్తే బాగుంటుంది

మన చరిత్ర ని మనమే కాపాడుకోవాలి

share this instead of reading alone

Leave a Reply

Top