మన ప్రొద్దుటూరు లోని అతి పురాతనమైన చరిత్ర కలిగిన ముక్తి రామలింగేశ్వరం గురించి ఇది వరకు ఒక ఆర్టికల్ రాయడం జరిగింది

ఇప్పుడు రాస్తున్నది అటువంటిదే మరొక ప్రాచీనమైన ఆలయం గురించి

అవును మీరు ప్రతి వరం దర్శించే ప్రొద్దుటూరు నడిబొడ్డున ఉన్న శివాలయం సుమారు 4000 ఏళ్ళ చరిత్ర కలిగి ఉంది..

మహా శివ రాత్రి బహుమతిగా ఈ ఆర్టికల్ ప్రొద్దుటూరు ప్రజల కోసం రాయడం జరుగుతుంది

ఈ శివాలయం కి ఉన్న అసలు పేరు అగస్తేశ్వర శివాలయము..

రిగ్వేద లోని పలు శ్లోకాలు రాసిన అతి గొప్ప అగస్తేశ్వర ముని..

క్రీ.పు 1500 సంవత్సరం లో ప్రొద్దటూరు నడిబొడ్డు లో శివలింగాన్ని ప్రతిష్టించారు దాని వలన ఈ ఆలయానికి అగస్తేశ్వర లింగేశ్వర ఆలయం అని పేరు వచ్చింది

క్రీ.శ 700 – 800 ఏళ్ళ కాలం లో కొందరు తెలుగు చోళ రాజులు అగస్తేశ్వర శివలింగానికి ఆలయాన్ని నిర్మించి భక్తి శ్రద్ధలతో పూజలు చేయడం మొదలు పెట్టారు

చోళ రాజుల తరువాత శాలువ రాజవంశానికి చెందిని విజయనగర మహారాజు ఉమ్మడి నరసింహ రాయులు 1491 వ సంవత్సరం లొ అగస్తేశ్వర ఆలయానికి అభివృద్ధి చేయడం మొదలు పెట్టి అత్యత సుందరంగా తీర్చిదిద్దారు..

14 భాషల్లో చాతుర్యం కలిగిన తెలుగు మహా కవి పుట్టపర్తి నారాయణ చార్యులు ప్రొద్దటూరు వారు అని మన అందరికి తెలిసిందే..

కాని అయన ఎంతో ఇష్టాంగా రాసి చాల గొప్ప పేరు సంపాదించినా శివ తాండవం ఈ శివాలయం లోని పెరట్లో పూల మొక్కల మధ్యలో కూర్చొని ఆశ్వాదిస్తూ రాసారు అని చాల మందికి తెలియదు

వాణిజ్య నగరం ప్రొద్దటూరు నడిబొడ్డున ఈ శివాలయం ఉండటం వలన ఈ ఆలయానికి భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది ఈ ఆలయం మహిమాన్యుతం అయినది అని ప్రొద్దటూరు ప్రజలు నమ్ముతారు

ఈ ఆలయం లో నాలుగు దిక్కులకు నాలుగు ద్వారాలు ఉన్నాయి ప్రతి ద్వారం వైపు 120 అడుగుల పొడవు 140 అడుగుల వెడల్పు తో 4 రాజ గోపురాలు ఉన్నాయి..

సుమారు 50 అడుగుల ఎత్తు గల ధ్వజ స్థంభం ఈ ఆలయానికి ప్రత్యేకం..

ప్రతి రాజా గోపురం పైన 5 బంగారం తో చేసిన కళాశాలను ప్రముఖ పీఠాధిపతుల చేత ప్రతిష్టించారు…

ఈ ఆలయానికి సుమారు 500 ఎకరాల పొలం ఉన్నట్లు ఇంకా చాల వరకు నగదు ఆస్తులు ఉన్నట్లు చెప్పుకుంటూ ఉంటారు అది ఎంత వరకు నిజమో తేలాల్సి ఉంది..

గుడి చుట్టూ గుడికి సంభందించిన ఎన్నో వాణిజ్య దకాణాలు ఉండటం అందరికి తెలిసినదే

ఈ ఆలయానికి సంబంధించిన దేవాదాయ శాఖా కూడా ఆలయాన్ని చాల గొప్పగా అభివృద్ధి చేస్తున్నారు అనే చెప్పుకోవాలి . మంత్రాలతో వారి తేరిన అతి గొప్ప పంతులను రాష్ట్రం నలుమూలల నుండి తీసుకొచ్చి ఆలయం లో అర్చకుల గ ఉంచడం విశేషం

ప్రొద్దుటూరు పట్టణం లో దసరా ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు అటువండి దసరా సంబరాల్లో అమ్మవారిశాల కి ధీటుగా అగస్తేశ్వర ఆలయం కూడా పలుగొంటుంది ప్రత్యేక మండపం లో అమ్మ వారి అలంకారణం ఈ ఆలయం ప్రత్యేకం

ఇదే ఆ 4000 సంవత్సరాల చరిత్ర కలిగిన అతి పురాతనమైన శివ లింగం…

ఈ లింగానికి ప్రత్యేకమైన అభిషేకాలు భక్తుల ద్వారా దేవాలయ అధికారుల ద్వారా నిత్యం జరుగుతూ ఉంటాయి

దేవాలయం లో శివుడి ఆలయం తో పటు పలు ఆలయాలు కూడా ఉన్నాయి

పట్టణం లో ఇంతటి చరిత్ర కలిగిన దేవాలయం ఉండటం మన అదృష్టం…

ఇది ప్రొద్దటూరు కి గర్వకారణం అని చెప్పుకోవచ్చు…

మనం ప్రతి వారం సందర్శించే శివాలయం గురించి మనం ఒక్కరమే తెలుసుకోవడం కన్నా ఇంకొందరికి చెప్పడం మన బాధ్యత…

ఈ పోస్ట్ ని షేర్ చేసి ఆ బాధ్యత ని నిర్వర్తించగలరు…

మహా శివరాత్రి శుభాకాంక్షలు

Leave a Reply

Top